గౌరవం కోల్పోయాడు: రాజేంద్రప్రసాద్‌పై జయసుధ వ్యాఖ్య
హైదరాబాద్: 'మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్'(మా) ఎన్నికల్లో రాజేంద్రప్రసాద్ చేతిలో జయసుధ 85 ఓట్ల తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఓటమిని ముందు ఊహించిన జయసుధ కౌటింగుకు కూడా హాజరు కాలేదంటూ సినీ వర్గాల్లో ప్రచారం జరిగింది. అసలు మురళీమోహన్ మీద వ్యతిరేకతే జయసుధ ఓటమికి కారణమైందంటూ పలువురు 'మా' సభ్యులు బహిరంగంగానే వ్యాఖ్యానించారు. ఈ పరిణామాల నేపథ్యంలో నటి జయసుధ మీడియా ముందుకు వచ్చారు. ఎన్నికల్లో విజయం సాధించిన రాజేంద్రప్రసాద్ కు అభినందనలు తెలిపారు. రాజేంద్రప్రసాద్ మాదిరి తాను ప్రచారం చేయలేక పోయానని, అయినప్పటికీ తాను 150 ఓట్లు సాధించానని జయసుధ చెప్పుకొచ్చారు. తన గురించి మాట్లాడేటపుడు రాజేంద్రప్రసాద్ ఇంకా కామెడీ చేష్టలు చేస్తున్నాడని, అలా చేయడం ద్వారా గౌరవం కోల్పోయాడని జయసుధ విమర్శించారు. ఎవరూ గెలిచినా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అభ్యున్నతికి తోడ్పడాలన్నదే తన కోరిక అని జయసుధ చెప్పుకొచ్చారు. మా ఎన్నికల్లో మొత్తం 702 ఓట్లకుగాను, 394 ఓట్లు పోలయ్యాయి. అధ్యక్షుడు: గద్దె రాజేంద్రప్రసాద్... 85 ఓట్లతో ఆధిక్యం విజయం ఉపాధ్యక్షులు: మంచు లక్ష్మి (ఏకగ్రీవం) కార్య నిర్వాహక కార్యదర్శి :

No comments:
Post a Comment