మే డే కానుకగా 'లయన్
నందమూరి నటసింహం బాలకృష్ణ నటిస్తోన్న తాజా చిత్రం 'లయన్'. రుద్రపాటి ప్రేమలత నిర్మాణ సారధ్యంలో జివ్వాజి రామాంజనేయులు సమర్పణలో ఎస్.ఎల్.వి సినిమా పతాకంపై రుద్రపాటి రమణారావు నిర్మిస్తోన్న ఈ చిత్రం ద్వారా సత్యదేవ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. తొలిసారిగా బాలయ్యతో త్రిష జతకడుతోండగా.. 'లెజెండ్' అనంతరం రాధికా ఆప్టే మరోమారు బాలకృష్ణ సరసన నటిస్తోంది. ఇటీవల విడుదలైన టీజర్, ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా బాలకృష్ణ గెటప్, డైలాగ్స్ కి అభిమానులు, ప్రేక్షకుల నుండి మంచి స్పందన వస్తోంది. అన్నీ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న లయన్ మే డే కానుకగా మే 1న విడుదల కానుంది.

No comments:
Post a Comment